నామినేషన్​ పత్రాలకు పూజలు, సంతకం చేసిన సీఎం కేసీఆర్.!

👉శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో..

👉1985 నుంచి అదే సెంటిమెంట్​ రిపీట్..

J.SURENDER KUMAR,

ఈ నెల 9న గజ్వేల్ కామారెడ్డి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలా చేయనున్న సీఎం కేసీఆర్ తన నామినేషన్ పత్రాలకు శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. సిమెంట్ మంత్రి హరీష్ రావు ఎంపీ సంతోష్ కుమార్, తదితరులు ఉన్నారు.
వివరాలలోకి వెళ్తే..

సిద్దిపేట జిల్లా కోనాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఈ ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన కేసీఆర్‌.. అనంతరం పూజలు చేశారు. అలయ అర్చకులు కేసీఆర్‌కు ఆశీర్వచనం అందించారు. అనంతరం నామినేషన్‌ పత్రాలపై కేసీఆర్‌ సంతకాలు చేశారు.
1983 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన కేసీఆర్.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తే అంతా శుభమే జరుగుతుందని.. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు చేసిన సూచనతో అప్పటి నుంచి నామినేషన్ పత్రాలకు ఆలయంలో పూజలు చేయడం కేసీఆర్‌ మొదలు పెట్టారు.1985 మధ్యంతర అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి నామినేషన్ పత్రాలకు పూజలు చేశారు.

అనంతరం ఏ ఎన్నికల్లో పోటీ చేసినా తిరుగులేని విజయం సాధించడంతో.. బరిలో నిలిచే ప్రతిసారి నామినేషన్‌ పత్రాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.