J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్ 30 న జరిగే ఎన్నికలకు . ఈనెల 3 న నోటిఫికేషన్ ప్రచురితం కానున్నది. అదే రోజున నామినేషన్ స్వీకరణ మొదలవుతుంది. నవంబర్ 10 నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ. 13 పరిశీలన, నవంబర్ 15 ఉపసంహరణ ఉంటుందని షెడ్యూల్ ప్రకటనలో పేర్కొంది.

పోటీ చేయనున్న అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ మరియు దాని వెంట అభ్యర్ధులు జతపరచవలసి న డాక్యుమెంట్ల వివరములు:-
👉 1) శాసనసభకు నామినేషన్ వేసేందుకు ఫారం 2 B. ఉచితంగా సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇవ్వబడును.
👉 2) ఒక అభ్యర్థి (4) నామినేషన్ల వరకు చేయవచ్చును.
👉 3) రెండు ఫోటోలు. ఒకటి నామినేషన్ పేపర్ పై మరియు ఒకటి ఫారం – 26 (అఫిడవిట్) పై అంటించుటకు.
👉 4) డిపాజిట్ మొత్తం రూ.10,000/-లు, షెడ్యూల్ కులము / షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారికి రూ.5,000/- బు, షెడ్యూలు కులము / షెడ్యూలు తెగల వారు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రము సమర్పించాలి.
👉 5) గుర్తింపు పొందిన జాతీయ / రాష్ట్ర రాజకీయ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ అదే నియోజక వర్గములోని ఓటరుగా నమోదైన ఒక్కరే ప్రతిపాదించవచ్చును (28 లోని పార్ట్-1).
👉 6) పోటీ చేసేందుకు నామినేషన్ వేసే ఇతరులు అనగా రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల వారు మరియు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను అదే నియోజకవర్గములోని (10) మంది ఓటర్లు ప్రతిపాదించవలసి ఉంటుంది (2B లోని పార్ట్ -11,
👉 7) ఇతరులు అనగా రిజిష్టర్ / గుర్తింపు పొందని మరియు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని (ఫారం-2B పార్ట్ 111 లోని (C) కాలం ఎదురుగా కేటాయించవలసిన గుర్తులను (EC) పంపిన ఫ్రీ సింబల్స్ నుండి) మూడింటిని ప్రాధాన్యతా క్రమంలో వ్రాయవలసి ఉంటుంది.
👉 8) పోటీ చేసే అభ్యర్థి పోటీ చేసే నియోజకవర్గము ఓటరు కానట్లయితే, అతడు ఓటరుగా నమోదైన నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నుండి ఓటరు జాబితా సర్టిఫైడ్ ప్రతిని తీసుకువచ్చి నామినేషన్ వెంట సమర్పించాలి..
👉 9) ప్రతిపాదించే వారు నిరక్షరాస్యులు అయి నామినేషన్ పేపర్లో వేలిముద్ర వేసినట్లయితే తిరిగి రిటర్నింగ్ అధికారి ముందు వేలిముద్ర వేయవలసి ఉంటుంది.