నామినేషన్స్ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ !


J.SURENDER KUMAR,


శుక్రవారం నుండి ప్రారంభమగు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పక్రియ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటులు చేపట్టినట్టు జగిత్యాల ఎస్పీ అన్నారు. గురువారం జగిత్యాల పట్టణంలో నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ అధికారులతో క్షేత్ర స్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….
శుక్రవారం నుండి ప్రారంభమగు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్స్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్, కేంద్ర బలగాలతో పటిష్ట భద్రత, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
👉 నామినేషన్ ల దాఖలుకు అభ్యర్థితో పాటు 5 గురికి ( 1 +4) కు మాత్రమే అనుమతి ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మందికి లోపలికి పర్మిషన్ లేదు అన్నారు.
👉 నామినేషన్‌ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
👉 ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు సహకారం అందించాలన్నారు.