👉న్యాయవాద వృత్తిలో 73 సంవత్సరాల 60 రోజులు
J.SURENDER KUMAR,
కేరళకు చెందిన న్యాయవాది, తన వృత్తిలో అరుదైన రికార్డును సాధించారు. పాలక్కాడ్‌కు చెందిన 97 సంవత్సరాల వయస్సు గల పి.బాలసుబ్రమణియన్ మేనన్.. అత్యధిక రోజులు న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
సంవత్సరాల 60 రోజులు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఈ మేరకు ఆయన రికార్డ్‌ను సెప్టెంబర్ 11న ధ్రువీకరించింది.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఇప్పటి వరకు ఈ రికార్డు జిబ్రాల్టర్ ప్రభుత్వ లాయర్ లూయిస్ ట్రియాస్ పేరున ఉంది. లూయిస్ 70 సంవత్సరాల 311 రోజులు న్యాయవాదిగా పనిచేసి. 94 ఏళ్ల వయసులో మరణించారు.
97 ఏళ్ల వయసున్న మేనన్.. యువ న్యాయవాదుల తరహా లో తన పనులు చేసుకుంటున్నారు. కోర్టు, ఆఫీసుకు వెళ్లి వస్తూ, రోజూ అనేక మంది క్లయింట్లను కలుస్తూ.. న్యాయవాద వృత్తి పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంటున్నారు మేనన్. “ఏదైనా కేసు విషయంలో ఓ వ్యక్తి నా వద్దకు వచ్చారంటే.. అతడు నాపైన పూర్తి నమ్మకంతో వస్తారు. అందుకోసమే నా శాయశక్తులా వారికోసం పనిచేస్తాను. కోర్టుల్లో ఎక్కువ వాదోపవాదాలు చేసుకోవడాన్ని నేను నమ్మను. కేవలం మన వాదనను సరిగ్గా చెప్పి.. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాను.” అని బాలసుబ్రమణియన్ మేనన్ అంటున్నారు.

తమిళనాడు చెన్నైలోని మద్రాస్ న్యాయ కళాశాలలో లా కోర్స్ పూర్తి చేశారు బాలసుబ్రమణియన్ మేనన్. అనంతరం 1950లో న్యాయవాద వృత్తిలో చేరి ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఎవరైనా రిటైర్మెంట్ ఎప్పుడని ప్రశ్నిస్తే… ఆరోగ్యం సహకరించిన్నని రోజులు.. బాధితులకు తనను కోరుకునే వరకు ఇలానే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటానని చెబుతున్నారు. ఈ రికార్డ్ కొంతమందిలోనైనా స్ఫూర్తిని నింపాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.