నేడే ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు..

J.SURENDER KUMAR,


అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలకానుంది. కేంద్రఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నోటిఫికేషన్  గవర్నర్ తమిళి సై ఆమోదంతో.. గెజిట్‌ నోటిఫికేషన్ జారీ చేస్తారు. నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత 119 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు నామినేషన్లు స్వీకరిస్తారు.

👉 ఈనెల 10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి.. మధ్యాహ్నం 3వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

👉 ఈనెల13న నామపత్రాల పరిశీలన చేపట్టనండగా.. ఈనెల 15 వరకు ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. 👉 ఈనెల 30న పొలింగ్‌ నిర్వహించి వచ్చేనెల 3న ఓట్లలెక్కింపు చేపడతారు. డిసెంబర్ 5లోపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.

👉 అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ.. నామినేషన్లను సిద్ధం చేసుకోవచ్చన్న ఎన్నికల సంఘం… నామినేషన్ల దాఖలు సమయంలో నిబంధనలు, అఫిడవిట్ల విషయంలో ఖచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేసింది.

👉 నామినేషన్ పత్రాలు దాఖలుతో అభ్యర్థుల వ్యయం లెక్కలోకి రానుంది. రేపట్నుంటి వ్యయ పరిశీలకులు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.
👉 ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా నాలుగుసెట్ల నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి రెండుకు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయరాదు.

👉 నామినేషన్ల దాఖలులో.. ఆర్​వో, ఏఆర్​వో కార్యాలయం సమీపంలోని వంద మీటర్ల పరిధిలోకి గరిష్ఠంగా మూడు వాహనాలనే అనుమతిస్తారు.

👉 నామినేషన్ ప్రక్రియ, కార్యాలయం వెలుపల వీడియో, సీసీటీవీ ద్వారా రికార్డు చేస్తారు.


👉అభ్యర్థులు నామినేషన్లను ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చు. ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ పోర్టల్ ద్వారా ఆ సదుపాయం ఉంది. ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించినా అభ్యర్థి ఆప్రతిపై సంతకంచేసి నిర్ధిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది.

👉 విదేశీ ఓటర్లు అక్కణ్నుంచే నామినేషన్ దాఖలు చేస్తే అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సుల్ కార్యాలయాల్లో ప్రమాణం చేయాల్సి ఉంటుంది.

👉 అభ్యర్థులు నామినేషన్‌తో పాటు.. అఫిడవిట్ దాఖలు చేసి ప్రమాణం చేయాల్సి ఉంటుంది. A. ఫారం, B ఫారాలను నామినేషన్ల దాఖలుకు.. చివరి రోజు 3 గంటల్లోపు విధిగా ఇవ్వాలి.  ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలను నామినేషన్‌తో పాటు సమర్పించాలి.

👉 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి అయితే ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది.

👉 ఇతరులకు 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతిపాదకులంతా అదే నియోజకవర్గానికి చెందినవారై ఉండాలి.

👉 నామినేషన్‌తోపాటు.. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ పత్రాలన్నీ రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డుపై ఉంచాలి.

👉అభ్యర్థుల అఫిడవిట్‌లను.. 24 గంటల్లోపు  వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

👉అఫిడవిట్‌లో ఏవైనా ఖాళీలుంటే. రిటర్నింగ్ అధికారి (R.O) సదరు అభ్యర్థులకు నోటీస్‌ జారీచేయాల్సి ఉంటుంది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లైతే దాన్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి.

👉 నామినేషన్ల దాఖలు సమయం నుంచే అభ్యర్థులు చేసే ఖర్చు ఎన్నికల వ్యయం పరిధిలోకి వస్తుంది. అప్పట్నుంచి అన్ని వివరాలు అభ్యర్థి నమోదు చేసి అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.