నేడు ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నామినేషన్..

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ధర్మపురి అసెంబ్లీ ( ఎస్సీ రిజర్వుడ్) కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శనివారం ధర్మపురి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు

👉 కాంగ్రెస్ పార్టీ వీడని లక్ష్మణ్ కుమార్ !

మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ కుమార్ ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా 2009 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై పోటీ చేసి 1365 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఈ నియోజకవర్గ లో జరిగిన  మధ్యంతర ఎన్నికలలో ఓడిపోయారు.
స్వరాష్ట్రం లో 2014 జరిగిన మొదటి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై లక్ష్మణ్ కుమార్  ఓటమి చెందారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై  స్వల్ప ఓట్లతో 445  ఓడిపోయారు.
ఓట్ల లెక్కింపులో  అధికారులు అవకతవకలకు పాల్పడి నన్ను ఓడించారు అంటూ. లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘ  అధికారులను సైతం హైకోర్టు విచారించింది. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో ఉంది.
ధర్మారం జెడ్పిటిసి సభ్యుడిగా 2006 లో మాజీ మంత్రి మాతంగి నరసయ్య పై పోటీ చేసి దాదాపు మూడువేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
2010-12 లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగారు. 2013 లో. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో  ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. విద్యార్థి దశలో ఎన్ ఎస్ యు నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కొనసాగారు.