👉సాయంత్రం కళాశాల మైదానంలో..
J.SURENDER KUMAR,
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం ధర్మపురి పట్టణంలో ‘ కాంగ్రెస్ విజయభేరి యాత్ర’ ఎన్నికల సభలో పాల్గొననున్నారని ఆ పార్టీ నాయకుడు సంఘనపట్ల దినేష్ తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు, చొప్పదండి అభ్యర్థి మేడిపల్లి సత్యం, హుస్నాబాద్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గౌడ్ , కరీంనగర్ అభ్యర్థి పూర్మల్ల శ్రీనివాస్, సిరిసిల్ల అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి, వేములవాడ అభ్యర్థి ఆది శ్రీనివాస్, రామగుండం, అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, హుజురాబాద్ అభ్యర్థి ప్రణవ్, ఈ సభకు రానున్నారని దినేష్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ మద్దతుగా ప్రచారంలో భాగంగా హెలికాప్టర్ లో సాయంత్రం నాలుగు గంటలకు ధర్మపురి కి చేరుకొని కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారని దినేష్ వివరించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత తదితర అంశాలపై అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలకు వివరిస్తారని అన్నారు.
కాంగ్రెస్ శ్రేణులు పట్టణం లోకాంగ్రెస్ ఫ్లెక్సీలు, జెండాలు, కటౌట్ల ఏర్పాటు చేయడంతో పాటు భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.