నోడల్ టీమ్ లు ఎన్నికల నియమావళి మేరకు విధులు నిర్వహిస్తున్నారు !

👉 కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా !

J.SURENDER KUMAR,

శాసన సభ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ నోడల్ టీమ్ లు ఎన్నికల నియమావళి మేరకు పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నారని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.

జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల భవన సముదాయం లో సోమవారం జిల్లా కంట్రోల్ రూం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ , మీడియా సెంటర్, లతో పాటు ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు.

👉ఇప్పటివరకు సువిధ పలు పార్టీల వారు వివిధ అనుమతుల కొరకు 1069 దరఖాస్తులు రాగా, 952 అనుమతులు ఇవ్వడం జరిగిందని, పలు కారణాల వలన 22 దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందని తెలిపారు.

👉సి విజిల్ యాప్ కు 521 ఫిర్యాదులు రాగా 474 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందని, 47 డ్రాప్ చేయడం జరిగిందనీ తెలిపారు.

👉1800 425 7620 కాల్ సెంటర్ కు 25 ఫిర్యాదులు అందగా ఆయా వాటిని పరిష్కరించామని తెలిపారు.

👉1950 హెల్ప్ లైన్ కు 1784 ఫిర్యాదులు అందాయని, ఇందులో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, ఎపిక్ కార్డులు, ఓటరు నమోదు, ఓటరు జాబితాలో పేరు ఉంది లేనిది తెలుసుకోవడం, మార్పులు, చేర్పులు, తదితర సమస్యలపై ఈ కేంద్రాన్ని ప్రజలు వినియోగించు కోవడం జరిగిందని తెలిపారు.

👉జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా ఇప్పటి వరకు 182 కేసులు నమోదుచేసి రూ. 1,95,49,010/- సీజ్ చేసి వాటిని పరీక్షించి , 180 కేసులు పరిష్కరించి రూ. 1,93,63,940/- లు తిరిగి ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఆయా నోడల్ అధికారులు, సిబ్బంది నిరంతరం విధుల్లో ఉండి ప్రజలకు సత్వర సేవలు అందించడం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలు అందిస్తున్నారని తెలిపారు.