పకడ్బందీగా పోలింగ్ నిర్వహణకు యంత్రాంగం సర్వసిద్ధంగా ఉంది!

👉కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమాచారం..

👉జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా!

J.SURENDER KUMAR,

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జిల్లాలో సజావుగా నిర్వహించేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించి సర్వో సన్నద్దంగా ఉన్నామని జగిత్యాల జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారిణి షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

బుధవారం ఢిల్లీ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్, తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్, అదనపు కలెక్టర్ లు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఈవిఎం యంత్రాల కమిషనింగ్, ఇంటి నుంచి ఓటు సేకరణ, పోలింగ్ సిబ్బంది శిక్షణ, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, తదితర అంశాలపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు.


జిల్లాలో 95973 ఓటర్ గుర్తింపు కార్డులు!
జిల్లాలో ఓటర్ గుర్తింపు కార్డులు ముద్రణకు 95973 ఆర్డర్ పెట్టామని, ఇప్పటివరకు 66735 కార్డులు పంపిణీ చేశామని అన్నారు. మిగతా 2923 కార్డులు వెండర్ నుండి తెప్పించి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఓటరు సమాచార స్లిప్పులు ఇప్పటివరకు 81.29 శాతం పంపిణీ చేశామని, వీటితో పాటు సి విజిల్ కరపత్రాలను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించు కొనుటకు జిల్లాలో 1141 ఉన్నాయని, ఈ నెల 24, 25 తేదీలలో ఇంటినుండి ఓటుహక్కు వినియోగించు కొనుటకు 72 టీమ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు.
పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసామని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పకడ్బందీగా పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు పోలింగ్ రోజున విధులు నిర్వహించే సిబ్బందికి ఓటు హక్కు కల్పించేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
జిల్లాలో కౌంటింగ్ నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని నియమించి వారికి శిక్షణ అందిస్తున్నామని, పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించేందు కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.