👉ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ,
J.SURENDER KUMAR,

జిల్లాలో పటిష్టమైన పక్క ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లా ఎన్నికల అధికారితో మరియు ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని జిల్లా ఎస్పి తెలిపారు. తద్వారా జిల్లాలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నాం
👉జిల్లా లోని పోలింగ్ కేంద్రాల వివరాలు
జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషను లు 927, సాధారణ పోలింగ్ స్టేషన్లు 676, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 251
👉జిల్లాలో ఇప్పటివరకు బైండోవర్ చేయబడిన వ్యక్తులు 3351
గతంలో ఎలక్ట్రోరల్ నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను మరియు అందులో సహకరించిన వ్యక్తులను బైండోవర్ చేయడమైనదని, రౌడీ షీట్ కలిగిన వారిని కూడా ముందస్తుగా బైండోవర్ చేయడం జరిగింది.
👉స్వాధీన పరుచుకున్న వివరాలు
ఇప్పటివరకు స్వాధీనపరచుకున్న నగదు 2,35,61,331/- రూపాయలు.
లిక్కర్ లీటర్ల లో 5230 సుమారుగా అంచనా విలువ 24,66,749 /-రూపాయలు,
👉 ఇతర సామాగ్రి
3962 చీరలు, 1228 టవల్స్ ,950 చీరలు డ్రెస్సులు,1907 తెల్ల షర్టులు, 132 హ్యాండ్ బ్యాగులు,140 హాట్ బాక్స్,104 గడియారాలు, 21 కుట్టు మిషన్ ఇతర వస్తువులు, సుమారుగా అంచన విలువ ₹1,41,49,846/- రూపాయలు.
👉సీజ్ చేసినా నగదు, లిక్కర్, గోల్డ్, ఇతర వస్తువుల విలువ మొత్తం విలువ ₹ 4,17,36,140/- రూపాయల
👉చెక్ పోస్ట్ లు:
అన్ని ప్రభుత్వ శాఖల సమక్షంలో, సమన్వయము తో జిల్లా సరిహద్దుల్లో ఉన్న 9 చెక్ పోస్ట్ ల లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రణాళికతో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మొబైల్ చెక్ పోస్టు లను ను ఏర్పాటు చేయడంతో పాటు సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్, నాక బంది వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
👉లైసెన్సుడు ఆయుధముల డిపాజిట్
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియామవళి అనుసారంగా లైసెన్సు కలిగిన ఆయుధములు అన్నియు డిపాజిట్ కొరకు అండర్ సెక్షన్ 144 Cr.pc అనుసరించి నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది , ఇప్పటికే జిల్లా లో ఉన్న మొత్తం 44 ఆయుధములు డిపాజిట్ కాబడినవి.
👉సోషల్ మీడియా పై నిఘా
సోషల్ మీడియా పై నిఘా కొరకు 24*7 ఐటీ సభ్యుల తో కూడిన స్పెషల్ టీం అనవసరమైన విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే లేదా ఇతరులను కించపరిచే విధంగా ఉండేటువంటి పోస్టులు పెట్టే వారిపై వేగవంతమైన చర్యలు తీసుకునేందుకు గాను ఐటీ కోర్ టీం సభ్యులతో కూడిన స్పెషల్ టీం ను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ నందు ఏర్పాటు చేయడం జరిగినది. కావున ఏదైనా వాట్సాప్ గ్రూప్లో లేదా ఇతర సోషల్ మీడియా లో పెట్టేటువంటి పోస్టులకు వాటి యొక్క గ్రూప్ అడ్మిన్లు బాధ్యత వహించవలసి ఉంటుందని ఎస్పి స్పష్టం చేశారు.
జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పి గారు కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.