ప్రభుత్వ ఉద్యోగుల చూపు కాంగ్రెస్ వైపు -మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు కారణమా ?

J.SURENDER KUMAR,

ఈనెల 30న జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అనే చర్చ మొదలైంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్ లొ ‘ అభయ హస్తం’ పేరిట.42 పేజీల తో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో సిపిఎస్ (కం ట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం ను అమలు చేస్తాం అంటూ పేర్కొన నేపథ్యంలో ఉద్యోగుల చూపు కాంగ్రెస్ వైపు మళ్ళీందనే చర్చ మొదలైంది.

👉కాంగ్రెస్ రాష్ట్రాలలో రద్దు!
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్,(ఆప్ ప్రభుత్వం) రాష్ట్రాలు సీపీఎస్ ను రద్దు చేశాయి. ఆయా రాష్ట్రాలు పాత పెన్షన్ స్కీంను అమలు చేస్తున్నాయి. కర్నాటకలో (డిసెంబర్ లో రద్దు చేయనున్నది) ఈ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సిపిఎస్ ను రద్దు చేస్తాం అని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో, గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ లో ఈ మేరకు జీవో రానున్నట్టు చర్చ.


రాష్ట్రంలో ఉన్న దాదాపు 3.40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో 2.10 లక్షల మందికి పైగా సీపీఎస్ విధానంలో ఉన్నారు. కొత్తగా ప్రభుత్వంలో చేరే ఉద్యోగులందరు కంట్రిబ్యూటరీ పెన్షన్లోనే ఉంటారు. ఇటీవల చేపట్టిన కొత్త రిక్రూట్మెంట్ తో పాటు ఆర్టీసీ, రెవెన్యూ లో కొందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. సంబంధిత జీవోలు వస్తే వాళ్లు కూడా సీపీఎస్ ఉద్యోగుల కిందకే వస్తారు. దాదాపు 3 లక్షల మంది దాకా ఉద్యోగులు సీపీఎస్ పరిధిలోకి రావచ్చు అని అంచనా.

అయితే, సీపీఎస్ ను రద్దు చేసుకునే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీఎస్ఆర్డీఏ) చట్టం కల్పిస్తోందని TSCPSEU వ్యవస్థాపక సంఘ అధ్యక్షుడు గంగాపూర్ స్థిత ప్రజ్ఞ అనేక సందర్భాల్లో చేపట్టిన పలు ఆందోళనలో, ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రాల్లో పేర్కొన్నారు.
👉20 సంవత్సరాల క్రితం రద్దు చేశారు!
ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానం 2004 జనవరి 1న ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రద్దుపరిచింది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 నుంచి సిపిఎస్ విధానం అమల్లోకి వచ్చింది. దేశంలో ప్రప్రథమంగా రాష్ట్రానికి చెందిన గంగాపూర్ స్థిత ప్రజ్ఞ్ , 2014 లో TSCPSEU (తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరి పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్) వ్యవస్థాపక అధ్యక్షుడి కొనసాగుతూ, ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలి, సిపిఎస్ రద్దు చేయాలంటూ జిల్లాల వారీగా ఉద్యోగులతో ఆందోళన, పోరాటాలు చేస్తున్నారు.
👉 ఓల్డ్ పెన్షన్ స్కీం ఇలా….
పాత పెన్షన్ విధానంలో 50 శాతం పెన్షన్, కుటుంబ సభ్యులకు 30% పెన్షన్, ₹16 లక్షల గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటివి ఉండేవి. పాత పెన్షన్ విధానంలో రిటైర్మెంట్ టైంలో వచ్చే జీతంలో 50 శాతం మొత్తాన్ని ప్రతి నెలా పెన్షన్ కింద చెల్లిస్తారు.
👉సిపిఎస్ విధానం ఇలా..
ఇప్పుడు సీపీఎస్ కింద ఉద్యోగి వేతనం, డీఏల నుంచి 10 శాతం, ప్రభుత్వం నుంచి మరో 10 శాతం సొమ్మును కలిపి ఎస్పీఎస్ ట్రస్టులో జమ చేస్తున్నారు. దీంట్లో ఉద్యోగి రిటైర్ అయ్యే వరకు జమ అయిన మొత్తం నుంచి 60 శాతం డబ్బును మాత్రమే ఉద్యోగికి చెల్లిస్తారు. మిగతా 40 శాతం డబ్బును షేర్ మార్కెట్లో పెడుతున్నారు. వచ్చే లాభాన్ని నెలవారి పెన్షన్ కింద రిటైర్డు ఉద్యోగికి చెల్లిస్తున్నారు. ఈ విధానంతో ₹ 1000/- దీంతో ₹,2000/- మాత్రమే పెన్షన్ తీసుకుంటున్నరు. అయితే పెన్షన్ దారులుగా మీరు ప్రభుత్వ రికార్డులలో నమోదు కావడంతో ఆసరా లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మీరు అర్హత కోల్పోతున్నారు.
👉ప్రతినెల ₹400 కోట్లు జమ!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ₹400 కోట్లను నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎస్పీఎస్) ట్రస్ట్ కు జమ చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగులకు చెందిన దాదాపు ₹16,500 కోట్ల సొమ్ము గత రెండు నెలల క్రితం వరకు ఎస్పీఎస్ ట్రస్టులో ఉన్నాయి.
👉మేనిఫెస్టో తో


అభయహస్తం’ పేరుతో.. 42 పేజీల కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో తో బీఆర్ఎస్, బిజెపి పార్టీలు సిపిఎస్ విధానం రద్దు చేసి. ఓల్డ్ పెన్షన్ విధానం కొనసాగిస్తారా ? లేదా అనే చర్చ ఉద్యోగ వర్గాల్లో మొదలైంది. శ్రీధర్‌బాబు కన్వీనర్‌గా ఏర్పడిన కమిటీ రూపొందించిన మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, అంగన్వాడీల ఉద్యోగ భద్రత, జీతాల పెంపు, జర్నలిస్టులో మృతి చెందితే ₹ 5 లక్షల ఆర్థిక సహాయం, ఇళ్ల స్థలాలు, తదితర 66 అంశాలు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలలో చర్చనీయాంశంగా మారినట్టు సమాచారం.