ప్రచారాన్ని పక్కన పెట్టి….

J.SURENDER KUMAR,

పోలింగ్ కేవలం 15 రోజులు సమయం, ప్రత్యర్త పార్టీలు ప్రచారాన్ని ఉదృతం చేస్తున్నాయి. అనుచరగణంతో ప్రచారానికి బయలుదేరిన నాయకుడికి, తాను ప్రయాణిస్తున్న రోడ్డుపై అప్పుడే జరిగిన ప్రమాద దృశ్యం అగుపించింది. తన ప్రచార వాహనలు నిలిపి క్షతగాత్రులకు చేయూత అందించారు.

వివరాలు ఇలా ఉన్నాయి.


ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ , ప్రచార నిమిత్తం బుధవారం ఉదయం తన అనుచరులతో వాహనాలలో వెల్గటూర్ మండలానికి వెళ్తున్నారు. అదే దారిలో పాశిగామ -స్థంభంపెల్లి మధ్య రెండు వాహనాలు ఢికొని ప్రమాదం జరిగింది. రోడ్డుపై క్షతగాత్రులు పడి ఉన్నారు.


లక్ష్మణ్ కుమార్, అతడి అనుచరులు ప్రచార పర్యటన పక్కన పెట్టి క్షతగాత్రులను. తమ వాహనాలలో ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.