ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలి!

👉 కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా !

J.SURENDER KUMAR

ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వహించాలని మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం లకు జిల్లా ఎన్నికల అధికారిణి , కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

బుధవారం జగిత్యాల IDOC లోని సమావేశ మందిరంలో ఎన్నికల కమీషన్ పరిశీలకులతో కలిసి కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల మాడల్ కోడ్ కండక్ట టీం లతో సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు టీం లోని అధికారులు వారి విధులను సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని అన్నారు.
ఓటర్లను ప్రభావితం చేసే వారి పట్ల నిఘా ఉండాలని, ఓటర్లను భయభ్రాంతులకు గురి కాకుండా యం.సి.సి. టీం లు పర్యవేక్షించాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో టీం లకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఎన్నికల కమీషన్ ప్రవర్తనా నియమావళిణి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
కోరుట్ల నియోజకవర్గం సాధారణ పరిశీలకులు రాజీవ్ రంజన్ మీనా, జగిత్యాల, ధర్మపురి సాధారణ పరిశీలకులు హెచ్. బసవ రాజేంద్ర, వ్యయ పరిశిలకులు షీల్ ఆశిష్, వివిధ నోడల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్, యం.సి.సి. టీం లు, తదితరులు పాల్గొన్నారు.