ప్రశాంత ఎన్నికల నిర్వహణ కై ఫిర్యాదు చేయండి.!

👉ఫిర్యాదు చేయు నెంబర్ 6302068249.

J.SURENDER KUMAR ,

ప్రశాంతంగా పారదర్శక ఎన్నికల నిర్వహణకు ప్రజలు నేరుగా ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను మొబైల్ నెంబర్ 6302068249 కు ఫోన్ చేయవచ్చని జగిత్యాల్ జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకులు సీనియర్ ఐపీఎస్ అధికారి, వివేకానంద్ సింగ్  తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం జగిత్యాల జిల్లా కు వచ్చిన పోలీస్ పరిశీలకులకు గా మేఘాలయ ఐపీఎస్ కేడర్ కు చెందిన  వివేకానంద్ సింగ్  ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ , స్వాగతం పలికారు.   జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాటు, బార్డర్ చెక్ పోస్ట్ లలో వాహనాల తనిఖీలు, అక్రమంగా రవాణా చేస్తున్న నగదు, విలువైన వస్తువులు, మద్యం మొదలగు వాటి స్వాధీనం, సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యల గురించి  ఎస్పీ వివరించారు.