ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ కచ్చితంగా అందాలి!

👉ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్

J.SURENDER KUMAR,

ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు కచ్చితంగా అందేలా ప్రణాళికలతో కార్యాచరణను జిల్లాలో అమలు పరచాలని రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు.

మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి వెబ్ క్యాస్టింగ్ నిర్వహణ, ఓటరు స్లిప్పుల పంపిణీ, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించు కోవాలని, దీనికి అవసరమైన మేరకు సిబ్బందిని సిద్దం చేసుకోవాలని, స్థానికంగా అందుబాటులో ఉండేకంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన యువతను వెబ్ క్యాస్టింగ్ కోసం వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఓటరు స్లిప్పులు అందలేదని గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయని, వీటి నివారణ కోసం ఎన్నికల కమిషన్ ముందస్తుగా ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిందని, పోలింగ్ కేంద్రాల వారిగా ఓటరు స్లిప్పుల ముద్రణ చేసి వాటి పంపిణీ పకడ్బందిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పర్యవేక్షణ కోసం నోడల్ అధికారిని నియమించాలని, ఓటరు స్లిప్పుల పంపిణీ అంశంలో ఫిర్యాదులు ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఓటరు స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ ను రాజకీయ పార్టీలప్రతినిధులకు ముందస్తుగా తెలియజేయాలని, వివిధ రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లను సైతం ఓటరు స్లిప్పుల పంపిణీలో భాగస్వామ్యం చేయాలని అన్నారు.

ఓటరు స్లిప్పుల పంపిణీపై ప్రతి రోజూ నివేదికలు సమర్పించాలని, ప్రతి ఒక్క ఓటరుకు తప్పనిసరిగా ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటరు జాబితా పై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాల రిజిస్టర్ లలో నమోదు చేయాలని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు, వారి అనుచరులకు సి- విజిల్ యాప్ పై అవగాహన కల్పించాలని, సి- విజిల్ యాప్ ను విస్తృతంగా వినియోగించడం వల్ల పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.
కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ..
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, వెబ్ కాస్టింగ్ కోసం JNTU కళాశాల 500 మంది విద్యార్థులను వెబ్ కాస్టింగ్ కోసం ప్రతిపా దించామని వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని ప్రత్యేకంగా కోరడం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లాలోని రిటర్నింగ్ అధికారుల తో కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్లందరికి ఓటరు స్లీప్ లు, ఓటరు గైడ్ లను పంపిణీ తో పాటు, సి – విజిల్ యాప్ ను ప్రతీ ఒక్కరు డౌన్ లోడ్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని, అందుకు షెడ్యూల్ సిద్దం చేసి, ఉత్తర్వులు జారీచేయాలని అన్నారు. పంపిణీ వివరాలు రిజిస్టర్ లో నమోదు చేసి, ఓటరు సంతకాలు తీసుకోవాలని సూచించారు. రోజువారీ పంపిణీ వివరాలను సమర్పించాలని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని తెలిపారు. మోడల్, మహిళా, పి.డబ్ల్యు.డి., యువత కు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలలో వసతులు, సౌకర్యాలు పరిశీలించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు నెంబరింగ్ చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, ఆర్డీఓ/రిటర్నింగ్ అధికారులు నరసింహ మూర్తి, రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు దెవరాజ్, నరేష్, ఎన్. భీమ్ కుమార్, ఈడిఎం మమత, తదితరులు పాల్గొన్నారు.