J.SURENDER KUMAR,
ఉమ్మడి వెల్గటూర్ మండలం రాజారాంపల్లి యంపిటిసి భారతీయ జనతా పార్టీ (బిజెపి) జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల మల్లేశం, వార్డు సభ్యులు, మాజీ ఉప సర్పంచ్ దుర్గం లింగయ్య మరియు ధర్మపురి నియోజకవర్గ స్థాయి పలువురు నాయకులు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో కెటిఆర్ సమక్షంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కేటిఆర్ వారికి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ధర్మపురి నియోజకవర్గ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్ రానున్న రోజుల్లో ఉన్నత స్థాయి లో ఉంటారని మంత్రి కెటిఆర్ అన్నారు