రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్య 9.9 లక్షలు!

👉36 వేల ఈవీఎంలు సిద్ధం..

👉72,931 బ్యాలెట్​ యూనిట్లు..

👉56,592 కంట్రోల్​ యూనిట్ల...

👉రాష్ట్రంలో 35,635 పోలింగ్​ కేంద్రాలు

👉ఎన్నికల ప్రధానాధికారి వికాస్​రాజ్ !

J.SURENDER KUMAR,

రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 9.9 లక్షల మంది ఉన్నారని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్​రాజ్ అన్నారు.
హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో గురువారం నిర్వహించిన సమావేశంలో  వివరాలను వెల్లడించారు.

వికాస్ రాజ్ మాట్లాడుతూ..
సర్వీస్​ ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కు ఉపయోగించుకున్నారని తెలిపారు. శాసనసభ ఎన్నికల కోసం 36 వేల ఈవీఎంలు సిద్ధంగా చేశామని చెప్పారు. ఈసారి కొత్తగా 51 లక్షల ఓటరు కార్డులు ముద్రించి పంపిణీ చేశామన్నారు.
ఈనెల 30న జరగనున్న పోలింగ్​ కోసం 72,931 బ్యాలెట్​ యూనిట్లు.. 56,592 కంట్రోల్​ యూనిట్లను ఈసీ అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
తెలంగాణలో శాసనసభ ఎన్నికల పరిస్థితిని సీఈవో  వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా ఓటర్​ స్లిప్​లను పంపిణీ చేశామని తెలిపారు.


60 మంది వ్యయ పరిశీలకులను నియమించామని.. మూడు కేటగిరీల వారికి హోం ఓటింగ్​ అవకాశం కల్పించాలమని వికాస్​రాజ్​ పేర్కొన్నారు. ఇప్పటికే 9 వేలకు పైగా ఓటర్లు హోం ఓటింగ్ వేశారన్నారు. ఇప్పటికే 86 శాతం ఓటరు స్లిప్పులు పంపిణీ పూర్తి చేశామని సీఈవో వికాస్​రాజ్​ తెలిపారు. ఈసారి ఓటరు స్లిప్​తో పాటు ఓటరు గైడ్​ బుక్​ లెట్​ ఇస్తామని చెప్పారు. అందులో ఓటు ఎలా వేయాలనే సమాచారం అలాగే ఫిర్యాదులు ఎలా చేయాలనే సమాచారం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.


 పోలింగ్​ సిబ్బందికి పోలింగ్​ కేంద్రంలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆరు నియోజకవర్గాల్లో 5 వేలకు పైగా పోలింగ్​ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. అభ్యర్థులు ‘సువిధ’  యాప్​ ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నారన్నారు. ఓటర్లు ఏమైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే సి-విజిల్​ యాప్​లో చేయొచ్చని సీఈవో వికాస్​రాజ్​ తెలిపారు. ఓటర్​ ఐడెంటీ కార్డులను 51 లక్షల వరకు ప్రింటింగ్​ పూర్తి చేశామని.. వాటిని పోస్టల్​ శాఖ వారికి ఇచ్చామని వారు పంపిణీ చేయనున్నారని తెలిపారు.

👉కొనసాగుతున్న ఈవీఎంల కమిషనింగ్​ 1

శాసనసభ ఎన్నికల కోసం ఈవీఎంలను హైదరాబాద్​లోని ఈవీ కాలేజీ డీఆర్సీ కేంద్రంలో ఎన్నికల అధికారులు కమిషనింగ్​ చేస్తున్నారు. అభ్యర్థులు, పరిశీలకులు, ఈసీఇఎల్​ ఇంజినీర్ల సమక్షంలో ఈవీఎంలు కమిషనింగ్​ నిర్వహించారు. బ్యాలెట్​ యూనిట్లు, కంట్రోల్​ యూనిట్లు, వీవీప్యాట్​ యంత్రాలను పరిశీలించారు. వీవీ ప్యాట్​ యంత్రాలను పరిశీలించిన అనంతరం ఎన్నికల సిబ్బంది సీల్​ వేయనున్నారు.
ఈనెల 30న జరగనున్న పోలింగ్​ కోసం 72,931 బ్యాలెట్​ యూనిట్లు.. 56,592 కంట్రోల్​ యూనిట్లను ఈసీ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు
.