👉 ధర్మపురిలో రేవంత్ రెడ్డి సభకు….
J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలో శనివారం సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు.

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూలు. ఈరోజు బెల్లంపల్లి, రామగుండం తరువాత ధర్మపురి కళాశాల మైదానంలో సాయంత్రం ప్రారంభం కానున్నది.

ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి భారీ సంఖ్యలో బ్యాండ్ మేళాలతో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పగలు మూడు గంటల వరకే సభా ప్రాంగణానికి చేరుకోవడంతో సభా ప్రాంగణం కిటకిట లాడుతుంది.

వేలాదిగా జనం సభకు కదలి రానున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు అంచనాలు వేస్తున్నారు.