సేవ కోసమే రాజకీయాల్లోకి – ఫ్యాషన్ కోసం కాదు !

👉నేను మీ అందరివాడిని..ఆదరించి ఆశీర్వదించండి !

👉మీడియా ఆత్మీయ సమ్మేళనంలో..

👉ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్..


J.SURENDER KUMAR,

జగిత్యాల మీడియా మిత్రులతో అనుబంధం ఈనాటిది కాదని వైద్యుడిగా సేవారంగంలో ఉన్నప్పుటి నుంచి ఆత్మీయ అనుబంధం ఉందని మీ అందరి సహకారంతో మొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో అభివృద్ధి చేశానని మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు.

బుధవారం స్థానిక విరుపాక్షి ఫంక్షన్ హాలులో మీడియా మిత్రులతో ఎమ్మెల్యే ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మీడియా మిత్రుల సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచాన్నారు. ఆనాటి నుంచి జగిత్యాల పట్టణ, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతర కృషి చేశానన్నారు. నాలుగున్నర ఏండ్లలో రెండేండ్లు కరోనా మూలంగా నేను చేయాల్సిన అభివృద్ధికి అడ్డుపడిందన్నారు. అయినా వంద పడకల ఆసుపత్రిని ఆరువందల పడకల ఆస్పత్రిగా, మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు చేరుకోవడంతో ఎందరికో మేలు జరుగుతోందన్నారు. పార్కుల అభివృద్ధి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులను చెప్పట్టడం జరిగిందని అన్నారు. ప్రతి పనికి అడ్డుపడుతూ అభివృద్ధిని ఆపాలని చూశారని మొండిగా బరిలో దిగి వీటన్నిటిని సాధించుకోవడం జరిగిందన్నారు. ధర్మపురి రోడ్డులో సెంట్రల్ లైటింగ్ పనులను చేపడితే నేషనల్ హైవై అథారిటి అధికారులకు ఫిర్యాదు చేసి పోల్స్ తొలగించేలా చేశారని ఎమ్మెల్యే చెప్పారు. మీడియా మిత్రులు ఆనాటి నుంచి నాతో ఎంతో ఆత్మీయంగా ఉన్నారని ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఏనాడు నన్ను బాధించే రీతిలో వార్తలను రాయలేదని అన్నారు. నేను కేవలం వైద్యుడిగా ఉన్న కాలంలో పేషంట్ వస్తే తనతో ఆ చికిత్స అవుతుందా? కాదా ?అని అక్కడే సూటిగా చెప్పడం అలవాటైంది. రాజకీయాల్లోకి వచ్చాక కూడా అదే విధానంలో ఉండడం కొందరిని భాదించి వుండొచ్చన్నారు. అలాగే మీడియా మిత్రుల్లో ఎవరైనా బాధపడివుండే క్షమించాలని కోరారు. మీ చిరకాల స్వప్నం నెరవేర్చాలని నేను సంకల్పంతో ఉన్నానని అది త్వరలోనే సాకారం చేస్తానని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చెప్పారు. మరోసారి ఎమ్మెల్యేగా ఆదరించి ఆశీర్వదించాలని గెలిపించాలని గెలిచాక మీ వెంటే ఉంటానని ఎమ్మెల్యే అన్నారు. మీడియా మిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో వంద మందికి పైగా ప్రింట్, ఎలక్ట్రానిక్ స్టాఫర్స్, ఆర్.సి లు, రిపోర్టర్స్, కేమరామేన్స్ పాల్గొన్నారు.