J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో జల అనుబంధం ఆలయంలోని శ్రీ యమ ధర్మరాజు స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజాది కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

”భరణి” నక్షత్రంను పురస్కరించుకుని స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తం తో అబిషేకం , ఆయుష్షు హోమం, హరతి మంత్రపుష్ప కార్యక్రమలు అత్యంత వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ ముత్యాల శర్మ , రెనవేషన్ కమిటి సభ్యులు , అర్చకులు ప్రదీప్ కుమార్ , నేరెళ్ల సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్, సూపరింటెండెంట్ కిరణ్ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ సంపత్ కుమార్ రాజగోపాల్ మరియు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా గోదావరి నది హారతి!

కార్తీకమాసం సందర్భంగా గోదావరి నదికి హారతి లొ బాగంగా పదమూడవ రోజు దేవస్థానం సిబ్బంది అర్చకులు స్థానిక మహిళలలచే శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం నుండి మేళతాళాలతో గోదావరి నదివరకు వచ్చి విశేష పూజల అనంతరం గోదావరి నదిలొ దీపాలు సమర్పించారు. కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు ముత్యాల శర్మ , పాలెపు ప్రవీణ్ కుమార్, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు అభిషేకం పురోహితులు బొజ్జా సంతోష్ కుమార్ , సంపత్ కు స్తానిక మహిళలు పాల్గొన్నారు.
నేడు పంచసహస్ర దీపాలంకరణ !

కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం వలె సోమవారం ధర్మపురి లోని బ్రహ్మ పుష్కరిణిలో (కోనేరు) పంచసహస్ర దీపాలంకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.