👉 జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్,
J.SURENDER KUMAR,

VRK కళాశాలలో ఏర్పాటుచేసిన క కౌంటింగ్ హాల్స్ మరియు స్ట్రాంగ్ రూమ్ ల యొక్క భద్రత పరమైన ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, స్వయంగా పరిశీలించారు.
పోలింగ్ ముగిసిన అనంతరం పోలైన ఈవీఎం ల భద్రతకై నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు మరియు కౌంటింగ్ హాల్ వద్ద పూర్తిస్థాయిలో అవసరమయిన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసామని తెలిపారు. వీటి భధ్రతకై కేంద్ర సాయుధ బలగాలని కేటాయించామన్నారు.

విధుల్లో ఉన్న అధికారులకు తగు సూచనలు చేసారు. ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని కౌంటింగ్ ముగిసే వరకు ఎటువంటి భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, డిఎస్పి వెంకటస్వామి,SB ఇన్స్పెక్టర్ నాగేశ్వర రావు పాల్గొన్నారు.