J.SURENDER KUMAR,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం 106 మంది పరిశీలకులను నియమించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా.. 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వీరంతా నవంబర్ 10వ తేదీ నుంచి విధులకు హాజరుకానున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఆయా నియోజకవర్గాల్లో ఈ పరిశీలకులు పర్యవేక్షించనున్నారు.
39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు. కేటాయించిన నియోజకవర్గాల్లో శాంతిభద్రతల నిర్వహణ, సంబంధిత అంశాలను వారు పర్యవేక్షిస్తారు. సాధారణ పరిశీలకులు, ఎన్నికల పరిశీలకులు నవంబర్ 10వ తేదీ నుంచి రంగంలోకి దిగనున్నారు.
క్షేత్రస్థాయిలో ఇప్పటికే ..
60 మంది ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్ అధికారులను వ్యయ పరిశీలకులుగా ఈసీ నియమించింది నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల ప్రారంభంతో వ్యయ పరిశీలకులు శుక్రవారం నుంచి విధులు చేపట్టనున్నారు.