.👉మంత్రి కొప్పుల ఈశ్వర్..
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గంలో సోమవారం జరిగిన క్రైస్తవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సేవకుల సహవాసం ( క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట, రాష్ట్రంలోని అన్ని మతాలను ఆదరించే సెక్యులర్ ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అందుకే అందరి సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు.