తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రధాని మోదీ!


J.SURENDER KUMAR,

ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని సోమవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ ద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ప్రధాని మోదీకి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత టీటీడీ ఛైర్మన్, ఈవో శ్రీవారి పట్టువస్త్రంతో ప్రధానిని సత్కరించి.. తీర్థప్రసాదాలు అందించారు. చివరగా ఆలయ అధికారులు ప్రధానికి శ్రీవారి చిత్రపటం, క్యాలెండర్‌, డైరీ అందించారు.

మోదీ ప్రధాని హోదాలో శ్రీవారిని దర్శించుకోవడం ఇది నాలుగోసారి. శ్రీవారి దర్శనం ముగిసిన పిదప తిరుపతి విమానాశ్రయానికి చేరుకోని హైదరాబాద్ వెళ్లనున్నారు. తెలంగాణలో జరగబోయే ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొననున్నారు.