👉 ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా..
విశాలాంధ్ర నే భావన కారణంగా ఆంధ్ర, తెలంగాణా నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరి, 1956 నవంబరు 1 న ఆధికారికం గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాజధాని అయింది. 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.
మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 – క్రీ.పూ. 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కథలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివసిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చు.
బ్రిటిషు పరిపాలనా కాలంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేవి. మద్రాసు ప్రెసిడెన్సీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు ఉండేవి. తెలుగువారికి ఓ ప్రత్యేక రాష్ట్రం ఉంటే బావుంటుందనే భావన ఆ రోజుల్లోనే మొదలయింది.

1912లో ఆధికారికంగా ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలయింది. ఉద్యమానికి టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి వంటి నాయకులు సారథ్యం వహించారు. 40 సంవత్సరాల పోరాటం, రెండు సుదీర్ఘ నిరాహార దీక్షలు, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం, విధ్వంసానికి దారితీసిన ప్రజల కోపం తరువాత 1953 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.
విశాలాంధ్రనే భావన కారణంగా ఆంధ్ర, తెలంగాణా నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరి, 1956 నవంబరు 1 న ఆధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాజధాని అయింది.2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.
రాష్ట్ర గీతంగా మా తెలుగు తల్లికి మల్లె పూదండ( రాష్ట్ర గీత రచయిత శంకరంబాడి సుందరాచారి), రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం, రాష్ట్ర క్రీడ కబాడీ, రాష్ట్ర పక్షి రామ చిలుక, రాష్ట్ర వృక్షం వేప చెట్టు, రాష్ట్ర ఫలం మామిడి పండు, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, రాష్ట్ర పువ్వు మల్లెపువ్వు ఎంపిక చేయబడ్డాయి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు ఉన్నాయి. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ పేరు పొందింది.
వ్యాసకర్త!
యం.రాం ప్రదీప్
జేవివి సభ్యులు, తిరువూరు 94927 12836