👉 అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో..
J..SURENDER KUMAR,
ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల నాయకులతో కలిసి ప్రతి ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
స్వర్గీయ మాజీ మంత్రివర్యులు రత్నాకర్ రావు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తప్ప ధర్మపురిలో ఇప్పటివరకు. మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన అభివృద్ధి అంటు ఏమీ లేదని, పలు ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు లక్ష్మణ్ కుమార్ ను కాంగ్రెస్ శ్రేణులను ఘనంగా స్వాగతించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు