టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు – కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్దీకరణ !

👉టీటీడీ పాలక మండలి నిర్ణయం!

J.SURENDER KUMAR,

తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం ఉదయం టీటీడీ పాలక మండలి సమావేశం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 114 జీవో ప్రకారం అర్హులైన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంపై సమావేశంలో చర్చించారు. శాశ్వత ఉద్యోగులకు ₹ 14 వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ₹.6,850 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 23 నుంచి అలిపిరి గోశాల వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నారు. ఈ హోమం నిర్వహణ రుసుం ₹ 1000 గా నిర్ణయించారు.
టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు
టీటీడీ పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కేటాయించే ప్రాంతాలలో ₹ 27.65 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు.

దీంతో పాటు ₹.15 కోట్లతో అదనంగా మరో రోడ్డు నిర్మాణానికి అనుమతినిచ్చారు. టీటీడీ ఉద్యోగులు అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించామని, స్థలాలు సేకరిస్తున్నామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి రాంనగర్ క్యాట్రస్‌లో అభివృద్ధి పనులకు ₹.6.15 కోట్లు కేటాయించామన్నారు. తిరుమల ఆరోగ్య విభాగంలో 650 ఉద్యోగులను మరో ఏడాది పొడిగించాలని నిర్ణయించామన్నారు. మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి తిరుచానూరు రోడ్డు అభివృద్ధికి ₹ 15 కోట్లు కేటాయించామన్నారు.

కరీంనగర్ లో స్వామివారి ఆలయం!

కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది అన్నారు.
స్వీమ్స్ వైద్య సదుపాయాలు పెంచాలని నిర్ణయించామని, కార్డియో విభాగానికి నూతన భవనం నిర్మిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రి భవనాన్ని ఆధునీకరణకు ₹.197 కోట్లు కేటాయించాలని నిర్ణయించామన్నారు. తిరుపతి డీఎఫ్ఓ ఆధ్వర్యంలో ₹.3.50 లక్షలతో నూతన కెమెరాలు, బోన్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. సంప్రదాయ కళలు, కలంకారీ, శిల్పకళ శిక్షణకు టీటీడీ ప్రాథమిక శిక్షణ ఇవ్వనుందన్నారు. ₹.4.89 లక్షలతో పుదిపట్ల నుంచి వకులమాత ఆలయం వరకు ₹. 21 కోట్లు రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. తిరుపతి పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి నూతన టీబీ వార్డు నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. స్వీమ్స్ వద్ద రోగులకు విశ్రాంతి భవనం కోసం ₹.3.35 లక్షలతో  చేపట్టనున్నమని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.