విధి నిర్వహణలో పోలీసుల ఆరోగ్యమే మా లక్ష్యం !

👉పోలీసులకు ఉలేన్ కోట్స్ పంపిణీ

👉 జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ,

J.SURENDER KUMAR,

రాత్రి పగలు ఎండ వానలలో విధులు నిర్వహిస్తున్న మా పోలీసుల ఆరోగ్య పరిరక్షణ మా లక్ష్యం అని జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ , అన్నారు.
పోలీసులకు మంజూరు అయిన ఉలేన్ కోట్స్ ను ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ , పోలీస్ ప్రధాన కార్యాలయం మంగళవారం పంపిణీ చేశారు.

విదినిర్వహణలో పోలీసు వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు హైదరాబాదులోని డీజీపీ కార్యాలయం నుండి తెప్పించి సిబ్బందికి పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు. క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లా పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు. పోలీస్ శాఖ గుర్తులతో కూడిన చలి కోటు, ఇతర వస్తువులను జాగ్రత్త చేసుకోవడం, పోలీస్ సిబ్బంది మాత్రమే వినియోగించుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర రావు, అడ్మిన్ ఆర్.ఐ జానిమియా, RSI వినోద్ రెడ్డి పాల్గొన్నారు