ఓట్ల లెక్కింపు కేంద్రంలో పనులను వేగవంతం చేయాలి !

👉 ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా!

J.SURENDER KUMAR,

ఓట్ల లెక్కింపు కేంద్రంలో పనులను వేగవంతం చేయాలని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

ఆదివారం  నూకపల్లి లోని విఆర్కె కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం లో చేపడుతున్న పనులను రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 28 లోగా పనులను పూర్తిచేయాలని, ఏజెంట్లకు, అధికారులకు ఏర్పాటు చేసిన క్యు  లైన్ లు తెలుపుతూ బోర్డ్ లను ఏర్పాటు చేయాలని, ఓట్ల లెక్కింపు కోసం టేబుళ్ళ ను సక్రమంగా అమర్చాలని ఆదేశించారు.


కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి లెక్కింపు కేంద్రాల్లోని గదులను పరిశీలించారు. సి సి కెమెరాలు భవనం చుట్టు బిగించాలని అన్నారు. ఆయా రిటర్నింగ్ అధికారులు పనులను పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, రిటర్నింగ్ అధికారులు దివాకర, నరసింహ మూర్తి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.