
👉ఆలోచన ఐఏఎస్ అధికారి నరహరిదే !
J.SURENDER KUMAR,
వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కాళ్ల నొప్పులు ఉన్నవారు ఏలాంటి అవస్థలు పడకుండా సులభంగా పోలింగ్ కేంద్రాలకు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి, వెళ్లడానికి ఏర్పాటుచేసిన ర్యాంప్ లు ( మెట్లు లేకుండా ఏటవాలు దారి ) నిర్మాణ ఆలోచన మన తెలంగాణ ముద్దుబిడ్డ సీనియర్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి పి .నరహరిది.

మధ్యప్రదేశ్, గ్వాలియర్ జిల్లా కలెక్టర్ గా నరహరి విధులు నిర్వహిస్తున్న సమయంలో వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, మహిళలు సులభంగా వారి నడకలకు ఇబ్బందులు తలెత్తకుండా, వారు అవస్థలు పడకుండా ఉండేందుకు, ప్రభుత్వ కార్యాలయాలలో, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో లాంటి ప్రదేశాల్లోకి వెళ్లేందుకు వీలుగా ఆయన రాంప్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్వాలియర్ జిల్లాలో రెండేళ్లలో వికలాంగులకు, వృద్ధులకు 95% అడ్డంకులు లేని నడక జిల్లాగా మార్చారు . ఇదే తరహాలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ముందు వికలాంగులు వృద్ధుల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంప్ ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

ది బెటర్ ఇండియా, నరహరి ని 2017 సంవత్సరంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన 10 మంది IAS అధికారులలో ఒకరిగా గుర్తించింది . వివిధ రాజకీయ పార్టీల వరుసగా మూడు ప్రభుత్వాలకు ప్రచార సలహాదారుగా అరుదైన ఘనత పొందిన వృత్తిపరమైన అధికారులలో నరహరి ఒకరు. పెద్దపెల్లి జిల్లా బసంత్ నగర్ ఐఏఎస్ అధికారి నరహరి ది స్వగ్రామం.