👉లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో..
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ ఎండపల్లి మండలంలో రాజారాం పల్లె, గుల్లకోట, చెర్లపల్లి గ్రామాలలో ఆదివారం జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆద్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల నాయకులు,కార్యకర్తలు ఘనంగా లక్ష్మణ్ కుమార్ ను స్వాగతించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీమతి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని,.ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని లక్ష్మణ్ కుమార్ కోరారు. ఇదే సందర్భంగా బిఆర్ఎస్ పార్టీపై పలు ఆరోపణలు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జితేందర్ రెడ్డి, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రావు, గోపాల్ రెడ్డి, బషీర్, జాడి రాజేశం, ఎంపిటిసి మంజుల, రంగు తిరుపతి, సర్పంచ్ మురళి, అధికార ప్రతినిధి విజయ్, మౌళి, లక్ష్మణ్, సంజీవ్, నరేష్, అశోక్, మహేష్, సంజీవ్, సుశీల్, రమేష్, గెల్లు శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు