ఎన్నికల కమీషన్ ఆధీనంలో సిబ్బంది విధులు నిర్వహించాలి !

👉ఎన్నికల పరిశీలకులు షిల్ ఆశిష్

J.SURENDER KUMAR,

ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు ఎన్నికల కమీషన్ ఆధీనంలో ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు షిల్ ఆశిష్ అన్నారు. సోమవారం IDOC సమావేశ మందిరంలో VST, VVT, SST, అకౌంటింగ్ టీమ్, లకు జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ తో కలిసి సవవేశం, శిక్షణ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆకౌటింగ్ టీమ్ లు అభ్యర్థికి సంబంధించిన ఖర్చుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని అన్నారు. ప్రవర్తనలో మార్పు రాకుండా ఎన్నికల నిబంధనల మేరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని అన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఎన్నికల విధులు నిర్వహించాలని అన్నారు. అభ్యర్థుల ఖర్చులకు సంబంధించిన షాడో రిజిస్టర్ నిర్వహించాలని తెలిపారు.


జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డులను ధరించాలని అన్నారు. ప్రతీ అంశం (ఐటమ్) కు సంబంధించిన ధరలను నిర్ణయించి టీమ్ లకు అందించామని, ఆ ధరలకు అనుగుణంగా ఖర్చులు నమోదు చేయాలని తెలిపారు. అంతకుముందు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆడిట్ అధికారిణి స్వప్న ఆయా టీమ్ లకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల నోడల్ అధికారులు, వివిధ టీమ్ ల ఉద్యోగులు పాల్గొన్నారు.