ఎన్నికల నిర్వహణ లో ప్రతీ అంశం పై అవగాహన కలిగి ఉండాలి !

👉కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా..

J.SURENDER KUMAR,

ఎన్నికల నిర్వహణపై ప్రతీ అంశం అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

సోమవారం కలెక్టరేట్ భవనంలో సెక్టరల్ అధికారులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమాచారం కోసం ప్రతీ అంశం తెలుసుకోవాలని, ఎన్నికల కమీషన్ జారీ చేసిన, పంపిన నిబంధనలు, విధులకు సంబంధించిన పుస్తకాలను చదవాలని అన్నారు. సేక్టోరల్ అధికారులు వారి పరిధిలోని ఎన్నికలకు సంబంధించిన అధికారుల వివరాలు తెలుసుకోవాలని అన్నారు. ఆయా రూట్ల వివరాలు తెలుసుకోవాలని, ప్రత్యామ్నాయ రూట్ల వివరాలు తెలుసుకోవాలని తెలిపారు. పోలింగ్ వివరాలు నిర్ణీత సమయానికి తెలియజేయాలని తెలిపారు. మాక్ పోల్ నిర్వహించాలని తెలిపారు. ప్రతీ అంశం తెలుసుకోవాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ శిక్షకులు తిరుపతి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గాలకు చెందిన సెక్టరాల్ అధికారులు పాల్గొన్నారు.