👉కేంద్ర ఎన్నికల పరిశీలకులు
J.SURENDER KUMAR,

శాసన సభ ఎన్నికలను పారదర్శకంగా, ఎన్నికల నియమావళి మేరకు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల ప్రత్యేక సాధారణ పరిశీలకులు అజయ్ నాయక్( రిటైర్డ్), ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా లు అన్నారు.
ఆదివారం జగిత్యాల జిల్లాకు వచ్చి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎన్నికల అధికారిణి, రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.

అంతకు ముందు జిల్లా లోని ఎన్నికలకు సంబంధించిన వివరాలను జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. ఎపిక్ కార్డుల పంపిణీ, కమ్యూనికేషన్ ప్లాన్, మైక్రో పరిశీలకులు, పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, ఈవిఎం ల రాండమైజేషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్స్, ఎంసిసి టీమ్, సి విజిల్, ఫిర్యాదులు, జిల్లా గ్రీవెన్స్ సెల్, తదితర అంశాలకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన జిల్లా కంట్రోల్ రూం ను వారు సందర్శించారు.
ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు రాజీవ్ రంజన్ మీనా, హెచ్. బసవ రాజేంద్ర, పోలీస్ పరిశీలకులు వివేకానంద సింగ్, ఎస్పి సన్ ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, రిటర్నింగ్ అధికారులు నరసింహ మూర్తి, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.