ఎన్నికల ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి …

జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా!

J.SURENDER KUMAR,

నవంబర్ 30న జరిగే శాసన సభ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు .
శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంబంధిత అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని  తెలిపారు.

👉సి .విజిల్ యాప్ ద్వారా 140 వరకు ఫిర్యాదులు అందాయని, వాటిలో 125 వరకు యదార్థమైనవి అని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 15 వేల మంది సి. విజిల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 785 పోలింగ్ స్టేషన్లు జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గ మలోకలిపి ఏర్పాటు చేసినట్లు తెలిపారు .
👉1950 హెల్ప్ లైన్ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. 80 ఏళ్ల వయో వృద్దులు, 40 శాతం అంగ వైకల్యం కలిగిన వారు, 13 రకాల ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించు కొనుటకు ఫారం 12 డి సమర్పించాలని తెలిపారు.

👉11 కంపెనీల బిఎస్ఎఫ్ బలగాలు రాక!
సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ…

జిల్లాస్థాయిలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి జిల్లా స్థాయిలో 8 చెక్ పోస్టులు ,అంతర్ జిల్లా స్థాయిలో 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే రెండు కంపెనీల బిఎస్ఎఫ్ జవాన్లు పనిచేస్తున్నారని ఇంకా తొమ్మిది కంపెనీల బలగాలు రానున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేక తరలిస్తున్న బంగారం , మద్యం, దుస్తులు, వివిధ వస్తువుల రూపంలో ₹ 3.65 కోట్ల విలువ గలవి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత , డి పి ఆర్ ఓ భీమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.