👉జగిత్యాల ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా..

J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణ కు నిర్ణీత కాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని జగిత్యాల ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని కొరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలలో అన్ని ఏర్పాట్లు నిర్ణిత వ్యవధిలో పూర్తీ చేస్తున్నామని తెలిపారు.

పకడ్బందీ చర్యలు !
జిల్లాలోని పోలింగ్ సిబ్బంది, జిల్లాలో 18 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 18 ఎస్.ఎస్.టి, 18 ఎం.సి.సి., 6 వీడియో టీం లు, 91 సెక్టోరల్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 7 అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు, జిల్లాలో 8 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
జిల్లాలో ఓటర్లు..
జిల్లాలో 6,99,203 ఓటర్లు కాగా ఇందులో 3,37,919 పురుషులు, 3,61,254 మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఓటర్ల వివరాలు, వయో వృద్ధులు, దివ్యాంగులు, యువతి యువకులు, సర్విస్ ఓటర్లు, థర్డ్ జెండర్ల, తదితర వివరాలను వివరించారు.
టోల్ ఫ్రీ నెంబర్:
1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఇప్పటి వరకు 1,024 కాల్స్ రావడం జరిగిందని, ముఖ్యంగా ఎపిక్ కార్డులు, మార్పులు-చేర్పులు, సవరణల, తదితర అంశాలకు సంబంధించిన కాల్స్ రావడం జరిగిందని వివరించారు. సి-విజిల్ యాప్ లో ఇప్పటి వరకు 251 ఫిర్యాదులు అందగా 222 సరైన వాటికీ సమాధానాలు అందించడం జరిగిందని, 28 కాల్స్ అసత్యంగా గుర్తించామని, మిగతా ఒకటి పెండింగ్లో ఉందని తెలిపారు. వంద నిమిషాలలో అ ప్రాంతానికి టీంలు చేరుకోవాల్సి ఉండగా 73 నిమిషాలలో చేరుకొని సమస్యను తెలుసుకోవడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమంలో భాగంగా సి-విజిల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే విధంగా ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించమని వివరించారు.
సువిధ యాప్ లో…
సువిధ యాప్ లో 480 దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకు 403 దరఖాస్తులకు మంజూరు ఉత్తర్వులు అందించామని, మరో 20 పురోగతిలో ఉన్నవని, 45 దరఖాస్తులు తప్పుగా భావించి రద్దు పరచడం జరిగిందని, మిగతా 12 పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
జిల్లా గ్రీవెన్స్ కమిటిలో..
జిల్లా గ్రీవెన్స్ కమిటిలో ఇప్పటి వరకు 1 కోటి, 27 లక్షల, 5 వేల, 790 రూపాయలు పట్టుబడగా నిర్ధారణ చేసి అట్టి సొమ్మును సంబంధిత వారికీ అందించడం జరిగిందని అన్నారు. అబ్సేంటి ఓటర్లకు 12-D ఫారం, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి 12 ఫారం అందించి ఓటు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మీడియా సర్టిఫికేట్ మానిటరింగ్ కమిటి ద్వారా వార్తా పత్రికలు, అడ్వర్టైజ్ మెంట్లు, టి.వి. చానళ్ళలో వస్తున్నా పెయిడ్ న్యూస్ ను గుర్తించడం జరిగి తదుపరి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లాలోని 3 నియోజకవర్గాలకు పంపిణి, రిసివింగ్ కేంద్రాలను, ఓట్ల లెక్కింపు కేంద్రాలను గుర్తించి పనులు పూర్తీ చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఎస్పి సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ₹ 4.18 కోట్ల విలువ గల సరుకులు, మద్యం, నగదు పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
పరిశీలన..

అనంతరం IDOC లో ఏర్పాటు చేసిన 1950 హెల్ప్ లైన్, జిల్లా కంట్రోల్ రూం, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటి, మీడియా సెంటర్లను పరిశీలకులు, అధికారులు పరిశీలించారు.
ఈ సమావేశంలో సాధారణ పరిశీలకులు రాజీవ్ రంజన్ మీనా, జగిత్యాల, ధర్మపురి, నియోజకవర్గాల పరిశీలకులు హెచ్. బసవ రాజేంద్ర, పోలిస్ పరిశీలకులు వివేకానందా సింగ్, వ్యయ పరిశీలకులు షీల్ ఆశిష్, రిటర్నింగ్ అధికారులు దివాకర, నరసింహ మూర్తి, రాజేశ్వర్, అదనపు ఎస్పి ప్రభాకర్, సహాయ రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.