ఎన్నికల వేళ ధర్మపురిలో..దొంగల గోల..

J.SURENDER KUMAR,

అసెంబ్లీ ఎన్నికల వేళలో ధర్మపురి పట్టణంలో దొంగల గోల మొదలైంది. గత రెండు రోజుల క్రితం జాతీయ రహదారి గల ఓ ఇంటికి తలుపులకు గ్రిల్ వేసి లోపలి గడియ తొలగించారు.

ఏదో చప్పుడు కావడంతో దొంగలు పారిపోయారు. నలుగురు సభ్యులు ఉన్న ఈ ముఠా కదలికలు ఓ సి సి టీవీ లో రికార్డ్ అయ్యాయి. వీరి చేతిలో కర్రలో,? కత్తులో ? ఉన్నట్టు చర్చ నెలకొంది. ఈ ప్రాంతనికి సమీపాన గల గుండయ్య పల్లెలో మరో రెండు ఇండ్ల లో దొంగతనానికి ప్రయత్నించారు.

శుక్రవారం సాయంత్రం గుడి వెనుక వైపు చైన్ స్నాచింగ్ జరిగినట్టు సమాచారం. ఎన్నికల వేళ ఈ దొంగల గోల ఏమిటో అని జనం ఆందోళన చెందుతున్నారు.