అంగరంగ వైభవంగా ధర్మపురి లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు!

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు ప్రాతః కాలములో వైకుంఠ ద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెరిచారు.

స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, అర్ధరాత్రి నుంచి ముక్కోటి ఉత్సవాల కార్యక్రమం ఆసంతం వరకు కార్యక్రమంలో పాల్గొన్నరు, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంఘీ సత్యమ్మ , ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఐ .రామయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ వార్షిక క్యాలెండర్ ను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ప్రముఖ గాయకుడు గుండి జగదీశ్వర్ శర్మ బృందం శేషప్ప కళావేదికపై ఆలపించిన భక్తి గీతాలు భక్షజనంను మంత్రముగ్ధుల్ని చేశాయి. చంద్రశేఖర్ శర్మ వ్యాఖ్యానం, వేదగోష భక్తజనం పరవశించారు.


ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహావిష్ణువును పూజిస్తారని పురాణ కథనం. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నట్టే అని నమ్మకం.


సమయపాలన పాటించారు!
ఆలయ కార్యనిర్వహణాధికారి, సంకటాల శ్రీనివాస్, వేద పండితులు అర్చకులు, సమయపాలన పాటించి నిర్ణీత సమయానికి స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను పుష్ప వేదికపై ఏర్పాటు చేశారు.

విఐపి ల కోసం వేచి చూడకుండా నిర్దేశించిన సమయానికి ఉత్తర ద్వారం తెరవడంతో భక్తజనం ప్రశాంతంగా తొక్కి సలాట లేకుండా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు.

( సమీక్ష సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఉత్సవాల్లో సమయపాలన పాటించాలని అధికారులను ఆదేశించారు). ఆలయ అధికారులు స్థానిక ఇసుక స్తంభం నుంచి భక్తులను క్యూలైన్ కు మళ్లించారు.

ఉత్తర ద్వారం వరకు ప్రత్యేక రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
ధర్మపురి ఆలయం పుష్పాలమయం!


ధర్మపురి ఆలయాలు వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించడంతోపాటు ద్వారా తోరణాలు ఏర్పాటు చేశారు. పుష్పాలు విద్యుత్తు కాంతులతో ఆలయ ప్రాంగణం అపర వైకుంఠంలో విరాజిల్లింది. శనివారం ఒక్కరోజు స్వామివారికి ₹8 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది.
పురవీధులలో ఊరేగింపు!


స్వామివారి ఉత్సవ మూర్తులను పురవీధులలో (సేవ) ఊరేగించారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో పాటు ఒగ్గు డోలు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, స్వామివారి పల్లకిని పురవీధుల్లో మోశారు.


నంది విగ్రహం వరకే వాహనాల అనుమతి!


సుదూర ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చిన భక్తజనం వాహనాలను నంది విగ్రహం వరకే అనుమతించారు. అక్కడ నుంచి కాలినడకన భక్తులు ఆలయంకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు.