ఆ తల్లికి జీవితాంతం రుణపడి ఉంటా సేవలు చేస్తా !

👉జగిత్యాల డి సి సి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్

J.SURENDER KUMAR,

కన్న కొడుకుని కోల్పోయి పుట్టడు విషాదంలో ఉన్న ఆ మాతృమూర్తి, అంతటి దుఃఖంలోనూ తన గెలుపు కోసం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తల్లికి జీవితాంతం రుణపడి ఉంటానని సేవ చేస్తానని, అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

శుక్రవారం ధర్మపురిలో లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన 32 సంవత్సరాల ఓరుగంటి మహేష్ అనే యువకుడు చనిపోగా మహేష్ మాతృమూర్తి తన కొడుకు అంత్యక్రియలు ముగిసిన వెంటనే నా గెలుపు కోసం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసిందన్నారు. జీవితాంతం తీరని బాధలో ఉన్న నా గెలుపు కోసం ఓటు వేయడం, ఆ తల్లికి నాపై ఉన్న అభిమానానికి తాను తన కుటుంబం ఆ తల్లికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.
ఈసారి నియోజకవర్గ ప్రజల అభిమానంతో, లక్ష్మీనరసింహస్వామి దయతో తాను గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
కృతజ్ఞతలు.
తనకోసం అహర్నిశలు కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు నాయకులకు ఎంతో అభిమానంతో తనకు ఓటు వేసిన తన నియోజకవర్గ ప్రజలకు లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం యొక్క అరాచక పాలనను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఇప్పుడు జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని లక్ష్మణ్ కుమార్ అన్నారు.

సర్పంచి ఓటునే తొలగించారు!

వెలగటూరు మండల కేంద్రంలో సర్పంచ్ మురళి తో సహా దాదాపు 150 మంది ఓట్లను గల్లంత చేసి అధికార ప్రభుత్వం తమ కుటిల బుద్దిని ప్రదర్శించిందని, ఆదివారం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అవినీతి పాలన అంతం కానున్నదని, లక్ష్యం కుమార్ జోష్యం చెప్పారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.