అయోధ్య అక్షింతలు చూడడం తాకడం నా అదృష్టం !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

అయోధ్యలోనీ శ్రీ రామజన్మభూమిలో అభిషేకం చేయబడిన అక్షింతల. దర్శన భాగ్యం శిరస్సుపై మోయడం నా పూర్వజన్మ సుకృతం అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి సోమవారం
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వారి ఆధ్వర్యంలో ధర్మపురిలో అయోధ్యలోనీ శ్రీ రామజన్మభూమిలో అభిషేకం చేయబడిన అక్షింతల శోభయాత్రలో భారీ సంఖ్యలో భక్తజనంతో పాటు ఎమ్మెల్యే పాల్గొన్నారు.

అక్షింతల శోభాయాత్ర పట్టణo లోని హనుమాన్ దేవాలయం నుండి (హనుమాన్ వాడ) మొదలు కోని గాంధీ చౌక్, నంది చౌక్ మీదుగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం ముందు నుండి గోదావరి వద్దగల శ్రీ రామాలయం వరకు శోభా యాత్ర జరిగింది. ఇట్టి శోభాయాత్రకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, భారీ సంఖ్యలో మహిళలు మంగళ హారతులతో విద్యార్థులతో కోలాటంతో కనుల విందుగా ఊరేగింపు జరిగింది. కేశవ యాత్రలో ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ తదితర హిందూ సంఘాలు పాల్గొన్నాయి.