బదిలీలు, పదోన్నతులు కొరకు ప్రభుత్వం చొరవ చూపాలి !

👉పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ దిశగా అడుగులు వెయ్యాలి !

👉నూతన రాష్ట్ర ప్రభుత్వంనకు శుభాకాంక్షలు !

👉టీ ఆర్ టీ ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో..

J.SURENDER KUMAR,

టీ ఆర్ టీ ఎఫ్ సంఘ ఆకాంక్ష పాత పెన్షన్ పునరుద్ధరణ అని నూతనం గా ఏర్పడిన ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ప్రకటించి సకల ఉద్యోగ ఉపాధ్యాయుల సంపూర్ణ మద్దతు పొందిందని ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులు కావలి అశోక్ కుమార్, కటకం రమేష్ లు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ నూతన ముఖ్యమంత్రి, నూతన మంత్రి వర్గానికి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ పెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కావలి అశోక్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ లు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆదివారం స్థానిక ధర్మపురి పట్టణం లోని కర్నె అక్కపెళ్లి కల్యాణ మండపం లో రాష్ట్ర అధ్యక్షులు కావలి అశోక్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ ల ఆధ్వర్యంలో టీ అర్ టీ ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు , 33 జిల్లాల అధ్యక్ష ప్రధానకార్యదర్శులు హాజరయ్యారు .


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
317 ఉత్తర్వులు బాధిత ఉపాధ్యాయుల సమస్యలు, మూడు డి ఏ ల ప్రకటన, నూతన పి అర్ సి ప్రకటన తో పాటు ఎన్నో సంవత్సరాలు గా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీలను ఎలాంటి అడ్డంకులు లేకుండా సాధ్యమైన తొందరగా అమలు జరిగేలా చూస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. దీనికి నిదర్శనంగా సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల్లో రెండు గ్యారంటీ లను అమలు చేసి నిబద్ధతను చాటుకున్నారని, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని హామీలను అతి త్వరలో అమలు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మునిసిపల్ ఛైర్పర్సన్ సంగి సత్తమ్మ ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సుబ్బారెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మానేటి ప్రతాప్ రెడ్డి, చీఫ్ ప్యాట్రన్ లక్కిరెడ్డి సంజీవ రెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు తుంగూరి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గజాబీంకర్ గోవర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయిని విజయానంద రావు బోల్లే చిన్నయ్య, రాష్ట్ర కార్యదర్శి రణధీర్ రాష్ట్ర కౌన్సిలర్ దాసరి భీమన్న, మండల అధ్యక్షులు బండారి సతీష్, ప్రధాన కార్యదర్శి ధర్మేంధర్, సంతోష్, భూంరెడ్డి, శ్రీకాంత్, రాజేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు