ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR ,
అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రుల వైద్య సేవలు. బడుగు బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉండి సేవలు అందించాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మంగళవారం జగిత్యాలలో శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ను లక్ష్మణ్ కుమార్ ప్రారంభించిన సందర్భంగా వ్యాఖ్యానించారు. అనంతరం ఎమ్మెల్యే
జగిత్యాలలోని శ్రీ సాయి బాబా దేవాలయంలో దత్తాత్రేయ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు స్వామివారి శేషాస్త్రం ప్రసాదం ఇచ్చి సన్మానించారు.

గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన అక్క విజయ్ కుమారుడు, వివేక్ మరియు బత్తిని శ్రీధర్ గౌడ్ లను ఓం సాయి హాస్పిటల్ వైద్య చికిత్సలు పొందుతుండగా వారిని పరామర్శించారు.
నియోజకవర్గంలో పర్యటన..
గొల్లపెల్లి మండలం గుంజపడుగు గ్రామంలో పలువురి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు.

వెలుగుటూరు మండలం కోటిలింగాలలో అయ్యప్ప స్వామి మెట్ల పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు ఎమ్మెల్యేను సన్మానించారు.

ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ లో పంచముఖ ఆంజనేయ స్వామి వార్షికోత్సవం సందర్భంగా

ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.