👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
బుగ్గారం మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందిన లక్ష్మణ్ కుమార్ మంగళవారం మొదటిసారి బుగ్గారం మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు శ్రేణులు ప్రజలు మేళ తాళాలతో ఘనంగా స్వాగతించారు. ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మను ఆలయాలను దర్శించుకొని విజయోత్సవ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటా మరియు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ. అభివృద్ధి పథంలో మన ధర్మపురి నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచుతానని. అన్నారు

బుగ్గారం గ్రామాభివృద్ధి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి గ్రామ సమస్యలపై, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పంచాయతీ అవినీతిపై ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చి సన్మానించారు.
పరామర్శ..

గొల్లపలలి మండలం శ్రీరాములపల్లి గ్రామనికి చెందిన ఓరుగంటి మహేష్ మృతి చెందగా వారి కుటుంబ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వారిని పరామర్శించి ఓదార్చారు.
అభినందనలు..

నూతనంగా ఎన్నికైన ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గా నియమితులైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.