👉నేడు సీఎం కెసిఆర్ , నాడు బాబు కు ..
👉సామాన్యుడిగా వస్తే సీఎం యోగం..
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ని సీఎం హోదాలో దర్శించుకుంటే వారి పదవులకు, ప్రభుత్వానికి గండం తప్పడం లేదు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపుల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ప్రస్తుతం సీఎం కేసీఆర్, తన సీఎం పదవిని కోల్పోవడంతో పాటు, పార్టీ ప్రతిపక్షంలో కూర్చున్న దుస్థితి నెలకొంది. 'ధర్మపురికి పోతే యమపురి లేదు', అనే భక్తజనుల నమ్మకం విశ్వాసం ముమ్మాటికి నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ సీఎం హోదాలో ధర్మపురికి వచ్చిన వారి పదవులకు గండం మాత్రం తప్పడం లేదు.

వివరాల్లోకి వెళ్తే..
👉సీఎం కేసీఆర్ 2019 ఆగస్టు లో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
👉2015 లో కెసిఆర్ సీఎం హోదాలో వచ్చిన గుడికి వెళ్లలేదు!
👉2015 గోదావరి పుష్కరాలలో సీఎం కేసీఆర్ ధర్మపురి వచ్చి గోదావరి నదిలో పుష్కర స్నానం చేశారు. కానీ ఆయన ఆలయం లోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకోలేదు, ఆలయం బయట రాజగోపురం దగ్గర నిలబడి నమస్కారం చేశారు.
👉గవర్నర్ నరసింహన్..
2017 జూలైలో నాటి తెలంగాణ గవర్నర్ నరసింహన్ ,దంపతులు ధర్మపురి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 2019 లో గవర్నర్ పదవికి దూరమయ్యారు.
👉2003 గోదావరి పుష్కరాల సందర్భంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీఎం హోదాలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమిపాలై బాబు సీఎం పదవిని కోల్పోయారు.

👉1978, జూలై మాసంలో అప్పటి సీఎం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి స్కైలాబ్ మన రాష్ట్రంలో పడదు, ప్రజలు నిర్భయంగా ఉండండి, అంటూ ధర్మపురి ఆలయంలోని కళావేదిక వద్ద ప్రజలతో సభ నిర్వహించి, స్వామివారి దర్శించుకున్నారు తర్వాత ఆయన సీఎం పదవికి దూరమయ్యారు.
👉2003 గోదావరి పుష్కరాలు నాటి కేంద్రమంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు, రాష్ట్ర మంత్రులు ముద్దసాని దామోదర్ రెడ్డి, హోం మంత్రి దేవేందర్ గౌడ్, చెరుకు ముత్యం రెడ్డి, విజయ రామారావు ,2023 లో ప్రస్తుతం మంత్రి హోదాలో కొప్పుల ఈశ్వర్ స్వామివారిని దర్శించుకొని పదవులకు దూరమయ్యారు. గతంలో స్వర్గీయ కేంద్ర హోం శాఖ మంత్రి జలగం వెంగళరావు, తదితర ప్రముఖుల సైతం ధర్మపురి స్వామి నీ అధికార హోదాతో దర్శించుకుని ఆ తరువాత పదవులకు దూరమయ్యారు.
👉శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో అంగ బలం, అధికార దర్పం ప్రదర్శించిన వారు తమ అత్యున్నత పదవులకు దూరమవుతున్నారు.
👉స్వామి వారిని సాదాసీదా హోదాలతో, భక్తి ప్రవృత్తులతో దర్శించుకున్న వారికి పదవుల యోగం, అధికార హోదాలో దర్శించుకున్న వారికి పదవుల వియోగం ఎందుకు అనే అంశం శ్రీ లక్ష్మీనరసింహుడికే తెలుసు కాబోలు…
👉అధికార దర్పం లేకుండా దర్శించుకున్న ఆరుగురికి సీఎం పదవులు…
కీలక పదవులు లేకుండా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న కొందరికి స్వర్గతుల్యమైన ఇంద్రలోకంతో సాటిగా సకల సౌకర్యాలు, సంపదలు, గల హంగు ఆర్భాటమైన జి హుజూర్ అంటూ అనుక్షణం హాజరుకు సిద్ధంగా ఉండే అధికార గణంతో గల పదవుల యోగం మాత్రం వారిని వరించింది, వరించనున్నది, అనేది భక్తజనంలో ఉన్న చర్చ. ప్రజల అదృష్టం మేరకు కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఆ పదవులు కాకతీయ తాళియంగా, వరించి ఉండవచ్చు స్వామివారిని సాదాసీదా పదవులతో దర్శించుకున్న కొంత కాలానికి వారికి పదవులు వరించడంతో ఈ అంశం భక్తజనంలో చర్చ కావడం గమనహారం
👉కెసిఆర్ కు.. యోగం

రాష్ట్ర సాధన ఉద్యమంలో నాటి ఉద్యమకారుడు నేటి సీఎం కేసీఆర్ 2003 గోదావరి పుష్కర లో ధర్మపురిలో ముఖం వేసి లక్షల లాధి రూపాయల వ్యయంతో ఇక్కడ యాగం నిర్వహించి అనేక సార్లు స్వామివారిని దర్శించుకున్నారు. 2014 స్వరాష్ట్రంలో సీఎం అయ్యారు.
👉తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పార్టీ ప్రచారంలో భాగంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నరు.1983, 1985, 1994 లో ఉమ్మడి రాష్ట్రాలో సీఎం అయ్యారు.
👉2003 గోదావరి పుష్కరాలలో సీమాంధ్ర ప్రాంత ప్రాంత ఎమ్మెల్యేలను అప్పటి స్థానిక ఎమ్మెల్యే మాజీమంత్రి రత్నాకర్ రావు వారిని ధర్మపురికి ఆహ్వానించారు. వారిలో ఒకరు చిత్తూరు జిల్లా వాయల్పాడు ఎమ్మెల్యే, కిరణ్ కుమార్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో చివరి సీఎంగా పనిచేశారు.
👉2003 లో గోదావరిఖనిలో జరిగిన ఆర్యవైశ్య సమావేశంలో పాల్గొన్న మాజీ సీఎం కే రోశయ్యను. ఆ సంఘ నాయకులు కొల్లేటి దామోదర్, రంగా అశోక్ ,రోశయ్య ను ఆలయానికి ఆహ్వానించారు. ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. 2009 లో విదిలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం గా పని చేశారు.
👉2015 లో గోదావరి నది హారతికి. మధ్యప్రదేశ్ బీజేపీ పార్టీ ఇంచార్జ్ మురళీధర్ రావు నాటి గోరఖ్ పూర్, పార్లమెంట్ సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ తో, పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. యోగి ఆదిత్యనాథ్ , రెండవ సారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. యూపీఏ ప్రభుత్వంలో బిజెపి జాతీయ నాయకుడు గోదావరి నది హారతి వ్యవస్థాపకుడు, మురళీధర్ రావు మొదటిసారి గోదావరి నది హారతి కార్యక్రమానికి మాజీ సీఎం స్వాది ఉమా భారతిని, మరికొందరు ప్రముఖులను ధర్మపురి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమా భారతి మొదటి ఎన్ డి ఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
👉స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు
ధర్మపురి క్షేత్రంలోమంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆయన అనేకసార్లు వేద పండితులతో ఇక్కడ ఇష్ట గోష్టి కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఆయన పలుసార్లు స్వామివారిని దర్శించుకున్నారు. సీఎంగా, ప్రధానమంత్రిగా పదవులు చేపట్టారు.
👉సదాసీదా పదవులతో దర్శించుకున్న వారికి…
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మాజీ మంత్రి స్వాదీ ఉమాభారతి, మాజీ మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, మాజీ మంత్రులు రత్నాకర్ రావు, కె వి కేశవులు జీవన్ రెడ్డి శ్రీధర్ బాబు ,స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు, తదితర ప్రముఖులు ఉన్నారు.
👉శకునం చెప్పే బల్లి కుడిదిలో పడ్డట్టు…
సీఎం కేసీఆర్ కు అపారమై దైవ భక్తి, పూజలు పునస్కారాలు, తిథి, వార నక్షత్రాలు, వాస్తు పట్ల ఎనలేని నమ్మకం విశ్వాసం పరిజ్ఞానం ఉన్న సీఎం కెసిఆర్. ధర్మపురి ఆలయ మహత్యము, పదవుల యోగం, వియోగం, అంశంపై అవగాహన ఉంది. అయినా సీఎం కెసిఆర్ ధర్మపురి ఆలయ దర్శనం ఎలా చేసుకున్నారో ? అనే చర్చ జరుగుతున్నది.