సీఎం రేవంత్ రెడ్డి సన్మానించిన ముస్లిం పెద్దలు!

👉సీఎం కార్యాలయ ప్రకటన లో

J.SURENDER KUMAR

సీఎం రేవంత్ రెడ్డి ని నేడు పలువురు ముస్లిం మత పెద్దలు, నాయకులు కలసి అభినందనలు తెలియచేశారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో వచ్చిన ముస్లిం మత పెద్దలు, నాయకులు సీఎంను సన్మానించారు.

ఈ సందర్భంగా మైనారిటీల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై వారు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో రవాణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎంఓ అధికారులు శివధర్ రెడ్డి, షా-నవాజ్ ఖాసీం, తదితరులున్నారు.