కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వచ్చినట్లైంది!

👉ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…

J.SURENDER KUMAR,

గత ప్రభుత్వ పాలన సమైఖ్య ఆంధ్ర పాలనా కంటే అద్వాన్నంగా సాగింది అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హైదరాబాదులో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అన్నారు.
ఆయన మాటల్లో..

తెలంగాణ రాష్ట్ర అప్పు 6లక్షల కోట్లకు దాటింది
మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక లోపాలు , నిర్మాణ లోపాలు ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖనే చెప్పింది ప్రాజెక్ట్ కి అనుమతి కూడా లేదు. లక్ష 20 వేల కోట్లు ఆర్ధిక భారం పడింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో అన్ని రకాలుగా కెసిఆర్ బాధ్యుడు. ఆ ప్రాజెక్ట్ కి CWC అనుమతి కూడా లేదు, అని కేంద్రం చెబుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలి , బాధ్యలైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకులోవాలి. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై వాస్తవాలను ప్రభుత్వం వెలికి తీయడంపై హర్షం వ్యక్తం..
వాస్తవాలను ప్రజలకు తెలియచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. మహారాష్ట్రతో ఒప్పందం ఉన్నందున తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చెయ్యాలి. తుమ్మడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చెయ్యాలని ప్రభుత్వానికి నా విజ్ఞప్తి
ఆరు గ్యారంటీలను అమలు చెయ్యాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం
మహిళలకు ఉచిత ప్రయాణం పై సోనియా గాంధీ పుట్టిన రోజు నుంచి అమలుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని జీవన్ రెడ్డి అన్నారు.