ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధికార నివాసం తుగ్లక్ రోడ్డులో 23వ నెంబర్ బంగ్లా !

J.SURENDER KUMAR,

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార నివాసం తుగ్లక్ రోడ్ లోనీ 23వ నెంబర్ బంగ్లా.

గత 20 సంవత్సరాలుగా మాజీ సీఎం కేసీఆర్​ అధికారిక నివాసంగా ఉన్న తుగ్లక్​ రోడ్డులోని 23వ. నెంబర్ బంగ్లా, శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బంగ్లా ఖాళీ చేసి కేసీఆర్​ వ్యక్తిగత వస్తువులను వేరే చోటుకు ఆయన సిబ్బంది తరలించారు.


2004 నుంచి 2014 వరకు ఎంపీగా, మంత్రిగా తుగ్లక్​ రోడ్డు నివాసం నుంచే ఆయన కార్యకలాపాలు జరిపేవారు. ఆ తర్వాత 2014 నుంచి 2023 డిసెంబరు తొలి వారం వరకు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్​ అధికారిక నివాసంగా తుగ్లక్​ రోడ్డు బంగ్లా ఉండేది. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం బంగ్లా ఖాళీ చేసి తెలంగాణ భవన్​ అధికారులకు మాజీ సీఎం కేసీఆర్​ సిబ్బంది బంగ్లాను అప్పజెప్పారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంగళవారం తొలిసారి బంగ్లాను సందర్శించారు. ప్రస్తుతం రేవంత్​ రెడ్డి నివాసం ఉన్న ఎంఎస్​ ఫ్లాట్స్​ యమున అపార్టుమెంటులో 902 ఫ్లాట్​ను త్వరలో ఖాళీ చేయనున్నట్లు సమాచారం. తుగ్లక్​ బంగ్లాలో మార్పులు చేర్పులు చేసిన తర్వాత పూజలు చేసి అధికారికంగా బంగ్లాను సీఎం రేవంత్​ రెడ్డి వినియోగించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.