దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ !

👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

👉సీఎం కార్యాలయ ప్రకటనలో..

J.SURENDER KUMAR,

దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని అన్నారు. మాజీ ప్రధానమంత్రి పీ.వీ. నరసింహా రావు వర్ధంతి సందర్భంగా శనివారం నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారు అని అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని సీఎం అన్నారు.