👉చీఫ్ సెక్రటరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం!
👉సీఎం ఓ కార్యాలయ వెల్లడి..
J.SURENDER KUMAR,
ధరణి ప్రారంభం నుండి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై వివరంగా నివేదిక అందచేయాలని ముఖ్యమంత్రి సీఎస్ ను ఆదేశించారు
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఈ కమిటీ ప్రతిపాదనలను సూచించాలన్నారు. ఈ కమిటీలో మంత్రులతోపాటు రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండాలన్నారు.
ఈ సమావేశంలో సీఎంఓ అధికారులు శివధర్ రెడ్డి, శేషాద్రి, షా-నవాజ్ ఖాసీంలు పాల్గొనగా, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రైతు ప్రతినిధులు కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.