👉గతంలో ఆరుగురికి వరించిన సీఎం యోగం !
👉నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం !
చేయనున్న రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ధర్మపురి ప్రముఖ పుణ్యక్షేత్ర దర్శన భాగ్యం తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. రేవంత్ రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. రేవంత్ రెడ్డికి సీఎం పదవి యోగం వరించడతో అనాదిగా భక్తులలో కొనసాగుతున్న నమ్మకం, విశ్వాసానికి బలం చేకూరింది.
కీలక పదవులు, హోదాలు హంగు ఆర్భాటం ప్రదర్శించకుండా సీదా సాధాగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న కొందరికి స్వర్గతుల్యమైన, ఇంద్రలోకంతో సాటిగా సకల సౌకర్యాలు, సంపదలు, గల హంగు ఆర్భాటమైన జి హుజూర్ అంటూ అనుక్షణం హాజరుకు సిద్ధంగా ఉండే అధికార గణంతో గల పదవుల యోగం మాత్రం వారిని వరించింది, భవిష్యత్తులోనూ వరించనున్నది, అనేది భక్తుల నమ్మకం విశ్వాసం. వారి అదృష్టం మేరకు కావచ్చు, ఎన్నికల కురుక్షేత్రంలో ఆయా పార్టీల గెలుపు తో కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఆ పదవులు కాకతీయ తాళియంగా, వరించి ఉండవచ్చు, కానీ ధర్మపురి క్షేత్రాన్ని, లేదా శ్రీ లక్ష్మీనరసింహస్వామి నీ సాదా సీదా పదవులతో దర్శించుకున్నవారు కొంత కాలానికి వారికి సీఎం పదవులు వరించడంతో ఈ నమ్మకం విశ్వాసానికి భక్తజనం లో చర్చకు ఆస్కారం ఇచ్చింది.
👉అధికార దర్పం లేకుండా దర్శించుకున్న ఆరుగురికి సీఎం పదవులు… నేడు ఏడో వ్యక్తి రేవంత్ రెడ్డి..

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గెలుపు కోసం నవంబర్ 11న ధర్మపురి కి వచ్చారు. బహిరంగ సభలో పాల్గొని లక్ష్మణ్ కుమార్ గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. నేడు సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.
👉రాష్ట్ర సాధన ఉద్యమంలో మాజీ సీఎం కేసీఆర్ 2003 గోదావరి పుష్కర లో ధర్మపురిలో ముఖం వేసి లక్షల లాధి రూపాయల వ్యయంతో ఇక్కడ యాగం నిర్వహించి అనేక సార్లు స్వామివారిని దర్శించుకున్నారు. 2014 స్వరాష్ట్రంలో సీఎం అయ్యారు.
👉 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పార్టీ ప్రచారంలో భాగంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నరు. 2983, 1985, 1994 లో ఉమ్మడి రాష్ట్రాలో సీఎం అయ్యారు.
👉 2003 గోదావరి పుష్కరాలలో సీమాంధ్ర ప్రాంత ప్రాంత ఎమ్మెల్యేలను అప్పటి స్థానిక ఎమ్మెల్యే మాజీమంత్రి రత్నాకర్ రావు వారిని ధర్మపురికి ఆహ్వానించారు. వారిలో ఒకరు చిత్తూరు జిల్లా వాయల్పాడు ఎమ్మెల్యే, కిరణ్ కుమార్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో చివరి సీఎంగా పనిచేశారు.
👉 2003 లో గోదావరిఖనిలో జరిగిన ఆర్యవైశ్య సమావేశంలో పాల్గొన్న మాజీ సీఎం కే రోశయ్యను. ఆ సంఘ నాయకులు కొల్లేటి దామోదర్, రంగా అశోక్ ,రోశయ్య ను ఆలయానికి ఆహ్వానించారు. ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. 2009 లో విదిలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం గా పని చేశారు.
👉 2015 లో గోదావరి నది హారతికి. మధ్యప్రదేశ్ బీజేపీ పార్టీ ఇంచార్జ్ మురళీధర్ రావు నాటి గోరఖ్ పూర్, పార్లమెంట్ సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ తో, పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. యోగి ఆదిత్యనాథ్ , రెండవ సారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు.
ధర్మపురి క్షేత్ర మహత్యమో, మహాన్విత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహమో తెలియదు కానీ పదవుల యోగం, మాత్రం వరిస్తున్నాయి.